నా జీవితం నా చేతుల్లోనే ఉండాలి అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకున్న అంటోంది అమెరికాలోని అట్లాంటా కు చెందిన మెగ్ టేలర్ మారిసన్ తనకు నచ్చినట్లు వెడ్డింగ్ గౌన్ కుట్టించుకొని ఉంగరం కొనుక్కొని పెళ్ళికూతురి అలంకరణ లో బంధువుల సముఖంలో  ఒక అద్దంలో తనను తాను చూసుకుంటూ పెళ్లి చేసుకుంది. గతంలో ఒకతను పెళ్లి చేసుకుంటానని  ముఖం చాటేశాడు  వరుడి విషయంలో నా అంచనాలు అన్నీ పోయాయి. నన్ను నేను ఓదార్చు కొన్నాను నాకు నేనే తగిన దానిని ప్రేమించుకోగల దాన్ని అందుకే ఈ పెళ్లి అని చెప్పింది. మెగ్ టేలర్ మారిసన్ ఆమె పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Leave a comment