ప్రపంచంలో అత్యంత శక్తి మంతమైన 100 మంది మహిళల పేరిట ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రియాంక చోప్రాకు చోటు దక్కింది. 94వ స్థానంలో నిలిచింది ప్రియంక చోప్రా. సినీ రంగం నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ప్రియాంక.గతంలోనూ ఆమె ఈ జాబితాలో చోటు దక్కించుకొన్నారు. ఇది రెండో సారి. ఈ ప్రతిస్టాత్మాకమైన జాబితాలో నా పేరుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రత్యేకత ,నన్ను నేను ప్రేమించే పనిని మరింత శక్తితో గౌరవంతో చేయాలని గుర్తు చేస్తోంది అంటోంది ప్రియాంకచోప్రా.

Leave a comment