నా బయోపిక్ నేనే తీస్తా అంటోంది కంగనా రనౌత్. ఇది నన్ను నేను కీర్తించుకోవటం కోసం కాదు. నా ప్రస్తానాన్ని నిజాయితీగా ఆవిష్కరించే భావోద్వేగభరిత చిత్రం .. విజయేంద్ర ప్రసాద్ గారు కథ సిద్దం చేస్తున్నారు. ఆయనే స్వయంగా నా జీవిత కథ స్క్రిప్ట్ రాస్తానని అడిగారు. ఆయన పైన ఉన్న విశ్వాసంతో వెంటనే అంగీకరించానని చెపుతోంది కంగనా. ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఏ మాత్రం పరిచయం లేని బాలీవుడ్ లో అడుగుపెట్టి ఏ గాడ్ ఫాదర్ సాయం లేకుండా కష్టపడి గుర్తింపు సాధించి ,మూడు జాతీయ పురష్కారాలు అందుకొనే స్థాయికి ఎదిగిన తీరు ఈ సినిమా కథ అంటోంది కంగనా రనౌత్. తన బయోపిక్ లో తానే నటిస్తూ దర్శకత్వం వహించటం బహుశా సినిమా చరిత్రలో ఇదే మొదలు కావచ్చు.

Leave a comment