నేను ఆర్మీ కిడ్ ను. క్రమ శిక్షణ నా రక్తంలో ఉంది. నియంత్రణలో ఉండటం అలవాటే అందుకే ఎంత హార్డ్ వర్క్ అయిన కష్టం అనిపించదు . అలాగే నాలో మంచి వ్యాపార వేత్త కూడా ఉంటాడనుకొంటున్న. మూడు ఫంక్షనల్ 45 జిమ్స్ ఆరంభించానంటే నేను వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.  అదృష్టం బాగుంటే ఇంకా కొన్నేళ్ళు ఈ పరిశ్రమలో ఉంటాను, వయస్సు పెరిగితే..అందుకే ఒక వ్యాపారం కావాలనుకొన్నాను. ఎఫ్-45 , ఆస్ట్రేలియన్ బ్రాండ్ కు తొలి ఇండియా బ్రాంచి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే ఈ బ్రాండ్ ముందుకు తీసుకుపోతారా, ప్రాంఛైజ్ ఆరంభిస్తారా అని నన్ను వాళ్ళు అడిగారు . అది నేను ఎందుకు ప్రారంభం చేయకూడదని అనుకొన్న ఆరోగ్యవంతమైన జీవితం నాకు ఇష్టం ఫిట్ నెస్ ,ఫుడ్ ,ఫిలిమ్స్ ఈ మూడు ఎఫ్ లు నా జీవితంలో భాగం అందుకే నా వ్యాపారం అదయితే బాగుండనుకొన్నాను అంటోంది రకుల్.

Leave a comment