మహానటిలో సమంత ఒక కొత్త ప్రయోగం చేయబోతుంది. తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతుంది. తెలుగు బాగా వచ్చు కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల ఆదాయం పోగొట్టటం ఎందుకని ఇప్పటి వరకు ఆ వైపు చూడలేదు అంటుంది సమంత. ఇప్పటి దాకా ఆమెకు డబ్బింగ్ చెప్పింది గాయని చిన్మయ్. ఏదైనా ఎప్పుడు ఒక కొత్తదనం ఉండాలి అంటుంది సమంత. రంగస్థలం లాగా ఈసినిమా కూడా నా కెరీర్ లో మరిచిపోలేని సినిమా అవుతుంది. ఇప్పుడు నేను గతంలో లాగా ఏ సినిమా పడితే అసినిమా ఒప్పుకోవటం లేదు . నాకు నచ్చిన పాత్ర వుంటేనే చేస్తున్నాను. పెద్ద సినిమానా, చిన్నదా ? సూపర్ స్టారా? చిన్న నటుడా అన్నది కూడా నాకు పట్టింపు లేదు అంటుంది సమంత.

Leave a comment