ఒక్క మాట అన్న సహించం అంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో కరీనాకపూర్ కూడా ముందే ఉంటుంది. తైమూర్ పుట్టాకా కూడా చిన్న పిల్లలా ఆ డ్రెస్ లేమిటి. తల్లిలా కనిపించరా అంటూ వినబడిన కామెంట్ చూసి కరీనా కపూర్ ఎవరైన ఏది సౌకర్యమో అది ధరిస్తారు మదర్ డ్రెస్ వేసుకోవడం ఎంటో అర్ధం కావడం లేదు. మా అమ్మ బబితా మా అత్త షర్మిలా టాగూర్ అయినా చక్కని మోడ్రన్ డ్రెస్ లే ధరిస్తారు. మాకు ఏది నచ్చిందో అది ధరించే స్వతత్ర్యం ఉన్న ఇళ్ళ నుంచి వచ్చాను. నేను ఒక పిల్లాడికి తల్లి అయితే షార్ట్ లు వేసుకోకూడదా. నాకు నమ్మకం ఉండి సౌకర్యం అనుకుంటే ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు అనుకుంటాను, వేసుకుంటాను కూడా అంటుంది కరీనా కపూర్. ఆ మాత్రం స్వేచ్చ అందరికి ఉంటుంది కదా.

Leave a comment