నీహారికా,  పరిక్షలు వస్తుననయి అంటే ఏ తరగతి పిల్లలలో అయినా కాస్త వత్తిడి ఉంటుంది .పిల్లలు దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు .ఫ్రెండ్స్ తో కబుర్లు మోదలుపెడతారు .పాటలు వింటారు .పుస్తకాలు వదిలేసి టీవీ ముందర కూర్చుంటారు .పెద్దవాళ్ళు నిరంతరం పరీక్షల గురించి మెంటల్గానే కాక ప్రోత్సహం ఇస్తూ వాళ్ళో చదువుపై మనసు పెట్టగలిగే పరిస్థితులు సృష్టించాలి .విసిగిపోతున్నారు అనిపిస్తే పది నిమషాలు బయటకి తీసుకుపోయి ఏదైనా తినిపించవచ్చు .పర్లేదు కాస్త రిలాక్స్ గా చదువుకో అని ప్రోత్సహించవచ్చు .స్టడీ షెడ్యూల్ వీలైనంత వరకు వారికి సహాయపడతాయి .నైతిక దైర్యం అందిస్తే చాలు పిల్లలు ప్రశాంతంగా చదువుపై దృష్టిపెడతారు .పిల్లలు ఏంచేస్తున్న చదువుపై ఏకాగ్రత శ్రద్ద ఉంచాలి .వాళ్ళని కాస్త కనిపెట్టి ఉండండి .భయపెట్టకండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .

Leave a comment