తెరపై కనిపించడం కాదు తెర వెనక టెక్నికల్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కెంతో ఇష్టం.అందుకే మలయాళంలో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను ప్రతి నిమిషం ఒక డైలాగ్ చదివి ఇది ఎందుకు ఇలా రాశారు అని,ఫలానా షాట్ కి కెమెరా వైడ్ యాంగిల్ ఎందుకు పెట్టుకోవాలి అని అందరిని అడిగి విసిగించే దాన్ని అందుకే నా దర్శకులు నన్ను కశ్చన్ మార్క్ ఫేస్ అని పిలుస్తారు అంటోంది అనుపమ పరమేశ్వరన్.ఎక్కువ మాట్లాడటం నాలో మైనస్ పాయింట్ అలా మాట్లాడితేనే సోషల్ మీడియాలో నన్ను ఎక్కువ ట్రోల్ చేశారు.నెమ్మదిగా కాస్త మారాను భవిష్యత్తులో మాత్రం నేను డైరెక్టర్ ని అవుతా అంటుంది అనుపమ పరమేశ్వరన్.

Leave a comment