నా పేరు సూర్యలో నటించింది అను ఇమ్మన్యుయెల్. ఏ పని చేసిన మంచి ఫలితం ఆశించి చేస్తాం. సినిమాలు కూడా అంతే కదా. నా వంతు కష్టపడుతాను అంటుంది అను ఇమ్మన్యుయెల్. కమర్షియల్ సినిమాల్లో హీరోనే ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు. కనుక హీరో పాత్రకే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు ఇలాంటివి పెద్దగా పట్టవు. నాకు ఇచ్చె ప్రాధాన్యత నాకు ఇస్తే చాలు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి కనుక ఏ సినిమా అయినా కూడా బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని తేలిపోయింది. అంచేత నాకు ఎప్పుడు మంచి అవకాశాలే వచ్చాయి. ఇంకా వస్తాయనే ఆశతోనే ఉన్నా. అన్నీ పాత్రల్లో అందరికి ప్రాముఖ్యత ఉన్న సినిమా మంచి సినిమా అవుతుంది. నేను అందులో బాగంగా అయితే నాకు సంతోషం అంటుంది అను ఇమ్మన్యుయెల్

Leave a comment