రేసు గుర్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐటమ్ గర్ల్ కైరాదళ్ ఉత్తరాది నుంచి దక్షినాదికి వచ్చి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటుందిట. కలకత్తా లో పుట్టిన కైరాదత్ మొదట్లో మెడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టింది. డాన్సర్ కావటం తో ఐటం సాంగ్స్ ఎంచుకుంది. సినిమా ప్లాప్ అయినా నా డాన్స్ కు పాట కు ఎలాంటి డోకా వుండదు. అందుకే మామూలు కరెక్టర్స్ కన్నా ఐటం సాంగ్స్   ఇష్టం అంటుంది కైరా. పైసా వసూల్ లో పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ వేసినా నా పాటే అందరికీ నచ్చింది అంటుంది కైరా. ఇవ్వాల్టి సినిమాల్లో ప్రత్యేకం కైరా వంటి ఐటమ్ గర్ల్స్ లేక పోయిన, ఆ లోటు తీర్చేస్తున్నారు హీరోయిన్స్.

Leave a comment