కొట్టాయింలో కమ్యునికేటివ్ ఇంగ్లీష్ లో గ్రాడ్యుయేషన్ చేసిన అనుపమా పరమేశ్వరన్ సింగిల్ సినిమా ప్రేమమ్ తో ఒక్కసారి ఎనలేని క్రేజ్ సంపాదించింది. డిగ్రీ చేస్తూనే కెరీర్ ను ప్రారంభించిన అనుపమా, మళయాళ టీవి ప్రేక్షకులకు తెలిసిన స్టారే. అక్కడ టీవి షోలు సెలబ్రేటీ చాట్ షోలు, రియాలిటీ షోలు చేసింది. తన నటనతో ప్రేమమ్ లో ప్రేక్షకులను కత్తి పడేసిన అనుపమ సొంత ఇల్లు కట్టుకుని దానికి ప్రేమతో “ప్రేమమ్” అని పేరు పెట్టేసుకున్నాది. రెండేళ్ళ ఓ అద్భుతం జరిగింది నా జీవితంలో. ప్రేమమ్ సినిమా నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. అందుకే నా కొత్త ఇంటికి ప్రేమమ్ అని పేరు పెట్టుకున్నానని ట్వీట్ చేసింది అనుపమ. తోలి సినిమాకి వచ్చిన స్పందన తో మరిన్ని తెలుగు సినిమాలకే నా ఓటు అంటుంది అనుపమ.

Leave a comment