తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఎన్నో బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా ‘నా ప్రతిభ పై నాకు నమ్మకం వుంది కాబట్టే, నా గురించి ఎవరెన్ని అభిప్రాయాలు వేల్లబుచ్చినా నేను పట్టించుకోలేదు’ అంటోంది. భాషలకు అతీతంగా విజయాలు, పరాజయాలు ఎదురొచ్చాయి కొన్ని ఫెయిల్ అయితే నా పని అయిపోయింది అన్నారు. నేను వినిపించుకోలేదు. ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. మొహమాటానికి పోయి ఏ పనీ చేయలేదు. అదే నాకు లాభించింది. అదే నా బలం కుడా ఇన్ని భాషాల్లో కధానాయకిగా కొనసాగుతున్నాను అంటే అదే కారణం అంటుంది తమన్నా. మూడు తెలుగు చిత్రాలు, ఓ తమిళ చిత్రం, ఓ హిందీ చిత్రం రాబోతున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానం పొందటం అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అంటుంది తమన్నా.

Leave a comment