Categories
మాన్సూన్ కేర్ గురించి హీరోయిన్ నీతూ చంద్ర అడిగిందే తడవుగా పెద్ద లిస్టు ఇచ్చేసింది. సెలబ్రెటీలు ఏం తాగుతారు, తింటారు అని ఇంటరెస్ట్ చూపించే అభిమానులకు ఈ డైట్ పార్సనల్ గా కూడా ఉపయోగ పదేట్టుంది. వర్షాకాలం డైట్ చాలా లైట్ గా వుంటుంది. సూప్ ఆకుకూరలు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటాను ఆవిరి పైన ఉడికించిన పదార్దాలు, గ్రిల్డ్ ఫిష్ లేదా పన్నీర్ తింటాను. ఇంట్లో చేసిన తాజా పండ్ల రసాలు లేదా అల్లం టీ అంతే, నిమ్మకాయ నీళ్ళు అయినా వాటర్ బాటిల్ అయినా నా వెంట ఉండవలసిందే. రెండు రోజులకోసారి తలస్నానం, పడుకునే ముందు శుబ్రంగా మేకప్ తీయాలి. ఇంకేం రాసుకోవదాలు వుండవు. అలాగే ఆభరణాలు వద్దు సీజన్ కోసమనే కాదు సాధారణంగా నా ఆహారం, వస్త్ర ధారణ ఇలాగే వుంటుంది అంటుంది నీటు చంద్ర.