పెళ్లి చేరాల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ చీర వుంటుంది. నాజూకు తనం ఉట్టిపడే ఈ సిల్క్ చీరలు అన్ని షేడ్స్ లోనూ దొరుకుతాయి. ఇప్పుడు సాంప్రదాయ సిల్క్ పై బంధిని స్టైల్, కసుటి ఎంబ్రాయిడరీ డిజైన్లలో సారి కొత్త చీరలు వస్తున్నాయి. ఒకప్పుడు సాదాగా చిన్న అంచు తో మామిడి పిందెల డిజైన్లు చిన్న చిన్న బుటీలు ఉండేవి. ఇప్పుడు డబుల్ లైన్ చెక్స్ హెవీ పట్లు రాకాలు పది వేల నుంచి లక్ష పైన ధర పలుకుతున్నాయి. పెళ్లి చీరలైతే ఒక్క దాన్లో 700 గ్రాముల పైన బంగారం 500 గ్రాముల ప్యూర్ క్రేప్ సిల్క్ వాడ తారు.బంగారం పుత పూసిన వెండి జరీ వుంటుంది. ఇప్పుడిక మైసూర్ సిల్క్ సల్వార్ కామీజ్ లు రోజు దొరుకుతున్నాయి. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సాయం తో కొత్త డిజైన్లు రుపొందిస్తు ఎలక్ట్రానిక్ లూమ్స్ ద్వారా నేసే ఈ సిల్క్ తరాలు మారినా ఎప్పటికి మారని ఫ్యాషన్.

Leave a comment