ఇటు బాలీవుడ్ లో, అటు హాలీవుడ్ లో తన తిరుగులేని గ్లామర్ తో చరిత్ర సృష్టిస్తున్న ప్రియాంకా చోప్రా ఇష్టాలు కూడా చాలా ఖరీదైనవి మంచి ఎంపిక కూడా. ఆమె తన ఇష్టాల గురించి చెపుతూ విలాసవంతమైన కార్లంటే నాకు క్రేజ్ ఇటీవల రెండు కోట్ల రూపాయిలతో రూల్స్ రాయిస్ ది ఘోస్ట్ కొన్నాను. బిఎండబ్ల్యు 7 సిరీస్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మెర్సిడెజ్ చెంజ్, ఎన్ క్లాస్, జాగ్వర్ పోర్స్ వంటి ఖరీదైన కార్లు నాదగ్గరున్నాయి. ఆహార విషయానికి వస్తే నేను మంచి భోజన ప్రియురాలిని ఒక్కసారీ మూడు నలుగు పరోటాలు తినగలను బర్లర్, జిలేబి, హాట్ వెల్వెట్ కేక్ వంటివి కనిపిస్తే తినకుండా నియంత్రించుకొలేను, చికెన్, మటన్, బిర్యానీలంటే చాలా ఇష్టం అంటోంది ప్రియాంకా చోప్రా ఎన్ని అందమైన డ్రెస్సుల్లో సినిమాల్లో, రెడ్ కార్పెట్ లపైన నడిచినా తనకి మాత్రం జీన్స్ ప్యాంట్లు టీ షర్టులే సౌకర్యంగా ఉంటాయని తన ఇష్టాల గురించి చెప్పింది ప్రియాంకా.

Leave a comment