మనిషి రోజుకి పది వేల అడుగులు నడవాలన్నది ఎపుడో యాబై ఏళ్ళ నాడు జపాన్ లోని వాకింగ్ క్లబ్బులు నిర్ణయించాయి . దేశ విదేశాలు వొప్పు కున్నాయి అయితే అదీ కనీస అవసరం మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంతకు ఎక్కువే నడవాలి. నిముషానికి వంద అడుగుల చొప్పున కనీసం మూడువేల అడుగులు వేస్తే అది ఒక మాదిరి వ్యాయామం నిద్ర లేవగానే రెండు నిముషాలు కాళ్ళు చేతులు సాగదీసి,కండరాలని కంట్రోల్ లోకి తెచ్చుకొని పావు గంట మెడిటేషన్ చేయాలి. ఒక అరగంట యోగ ,లేదా వ్యాయామం చేయాలి. ఇవి చేయకపోతే జీవన సరళి మనిషిలో నింపుతున్న వత్తిడిని పారదోలే అవకాశం లేదు . ఈ ఒత్తిడి శరీరం పైన పనిచేసి మనిషి ఫిట్ నెస్ ని దెబ్బ తీస్తుంది. అందుకే అరగంట నడక,ప్రాణాలు నిలుపు కోవటం కోసం అన్నంత దీక్షగా పాటించాలి.

Leave a comment