నడుము నొప్పి ఎంతో మంది సమస్య . ఇది దీర్ఘకాల సమస్య కూడా . ఈ నొప్పికి తాత్కాలిక ఉపశమనం గా మందులు వాడడం కన్నా నడకే మేలు అంటున్నారు అమెరికా పరిశోధకులు. దీర్ఘకాలంగా నడుము నొప్పి తో బాధపడుతున్న వేల సంఖ్య లో మనుషుల పైన పరిశోధన చేశారు . వీరిని ప్రతి రోజు అరగంట నడకతో మొదలుపెట్టమన్నారు . దీర్ఘకాలంగా నడుము నొప్పి తో ఉన్నవాళ్ళలో 16 శాతం మందికి కొంత ఉపశమనం కలిగింది . తాత్కాలిక నడుము నొప్పి తో బాధపడేవాళ్ళలో సగం పైగా మందిలో నొప్పి కనబడలేదు . ఎలాంటి వ్యాయామం లేకుండా ఉన్నవాళ్ళలోను ,అస్సలు నడక లేకుండా మరీ విశ్రాంతి గా ఉండేవాళ్ళలోనూ ,నడక కారణంగా శరీరంలో కదలికలు ఏర్పడి నొప్పి పోయిందని అధ్యయనకారులు తేల్చారు .

Leave a comment