ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతానని కైరా అద్వాని ప్రతి ఉదయాన్నే ఆరోగ్య పూరితంగా ప్రారంబిస్తాను అంటోంది. ఒక గిన్నేడు తాజా పండ్లతో రోజును ఆరంబిస్తాను.బొప్పాయి లేదా సీజనల్ పండు తింటాను. రోజు మార్చి రోజు పండ్లు లేదా ఓట్ మిల్క్ లేదా ఓట్స్ ఉప్మా తింటాను.ఉదయం పదకొండు గంటలకు బ్లాక్ కాఫి తాగుతాను.లంచ్ లో ఫిష్ తింటాను.దీనితో పాటు ఒక బౌల్ కూరగాయలు తింటాను.బెండ,సొర,గుమ్మడి,పాలకూరలు సాధారణంగా డైట్ లో ఉంటాయి.డిన్నర్ చాలా తేలిగ్గానే ఉంటుంది.లంచ్ లో గాని కొన్ని సార్లు లోటస్ స్టెమ్,పుట్టగొడుగులు వంటివి కలుపుకొంటాను.శనివారం కాస్త నాకిష్టమైనవన్ని తింటాను.ఆదివారం కూడ కాస్త అటు ఇటు గా నా ముడ్ ని బట్టి కబాబ్ లు పిజ్జా తింటాను అంటోంది. ఈ వెండి తెర వేల్పులు ఏది తిన్నా డైటిషియన్ సలహాలు వర్కవుట్స్ చేసే ఉద్దేశ్యంతో తింటారు కనుక బరువుండరు.ఎంత తైలికైన అహారం తిన్నా వ్యయామం లేకపోతే ఇబ్బందే అంటుంది కైరా.

Leave a comment