ప్రకృతికంటె అద్భుతమైన విషయం ఇంకేదీ ఉండదు. ఎంత చుసిన తనివి తీరనంతా అందంగా మనిషిని ఆకర్షిస్తూనే ఉంది. చైనాలో హుబ్ ప్రావిన్స్ లోని జ్ఞానా నేన్ కౌంటీలు ఒక పొడవాటి వంతెన వుంది. పర్వతాల మధ్య ఓ లోయలో నీలం రంగుతో మెరిసిపోతూ ప్రవహించే ఓ నదిలో ఈవంతెన కట్టారు. నది మధ్యలో చెక్కతో ఏర్పాటు చేసిన ఈ వంతెన 1640 అడుగుల పొడవుతో ఉంటుంది. పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఈ లోయను ప్రకృతి అందాలను చూసేందుకు ఏర్పాటు చేశారు. పచ్చని చెట్ల మధ్య జలజల పారుతున్న నదితో పాటు నడుస్తున్నట్లు ఉంటుందీ వంతెన.

Leave a comment