నూటికి 90 మందికి శరీరం ఫీట్ గా ఉంటేనే ఇష్టం. ఎన్నో వ్యయామాలు చేసి తినే పదర్ధాలు పైన ఆంక్షలు పెట్టుకుని శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని చూస్తారు. కాని ఫిట్ గా ఉండటం ఏమిటి? ఎలా తెలుస్తుంది అంటే దానికి ఏ టెస్ట్ అవసరం లేదు. అద్దం ముందు నిలబడి నడుం చుట్టు కొలత చూసుకుంటే అది చేతికి పట్టుకుంటే అందేలా ఉంటే ఓకే, పెరిగి వేలడుతుంటే ఫిట్ గా లేనట్లే , దాని వల్ల ఇన్ ఫ్లమెషన్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. మొత్తం జీవక్రియ దెబ్బ తింటుంది అంటారు డాక్టర్లు. బాడీ మాస్ ఇండెక్స్ ఆధారం చేసుకుని ఎంతోమందికి పరీక్షలు నిర్వహించి నడుం చుట్టుకొలత అధికంగా ఉన్నవాళ్లలో ఉండవలిసిన దానికన్న అధిక బరువు గుర్తించటం ఫిట్ గా ఉండేవాళ్ళలో పొట్ట దగ్గర కోవ్వు లేకుండా ఉండటం గమనించారు.

Leave a comment