పిల్లలు అధికంగా టీవీ చూడటం వల్ల వారి నడుము కొలతల్లో తేడాలోస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. స్కూలుకు వెళ్ళని పిల్లలు చాలా మంది పసితనం నుంచే టీవీ ముందు అర్థం కాకపోయినా రంగులలో ఉన్న బొమ్మలను ఏక దిక్షతో చూస్తూ ఉంటారు.అలా అలవాటు పడి బయటికి పోయి ఆడుకొనేందుకు కూడా ఇష్టపడరు. నాలుగేళ్ళ వయస్సు గల పిల్లలు వారంలో 18 గంటల పాటు టివీ చూస్తే వారికి పదేళ్ళు వచ్చే సరికి నడుము కొలత 7.6 ఎం.ఎం పెరుగుతోందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పరిస్థితిని పెరిగేకొద్ది పెరగనివ్వద్దనీ చిన్న వయస్సే కదా అని టివిలకు అలవాటు చేయవద్దనీ వారి ధ్యాసకు ఇతర కార్యక్రమాలు లేదా కాసేపు బయట పిల్లలతో ఆడుకొనేలా చేయమని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment