నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ నటించిన 50వ చిత్రం. ఆమె మొదటి చిత్రం లక్ష్మి కళ్యాణం తెరక్కెక్కించిన తేజానే ఈ సినిమా దర్శకుడు కూడా. రాజమౌళి మగధీర సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న నటి కాజల్ దశాబ్ద కాలంగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. డబ్బు విషయంలో చాలా పక్కా ప్రణాళికతో ఉంటుందామె. చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి నగల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆన్ లైన్ అమ్మకాల తో పాటు ఫ్యాషన్ ఎగ్జిబిషన్ స్టోర్ లు ఏర్పాటు చేస్తుంది. రాషి ఖన్నా నుంచి సోనక్షి సిన్హా వరకు నాకు కష్టమర్లే అంటుంది సోషల్ మీడియా అప్ డేట్ ల తో కొత్త రకం ప్రొమోషన్ చేస్తుంది కాజల్. అంతకు ముందు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ప్రారంభించింది. ఒకే రకమైన ప్రోఫెషన్ లో వున్నా వాళ్ళు కలసి ఒకే వేదికగా మాట్లాడుకునే వేదిక ఇది. అలాగే ఇందులో తమ ప్రొడక్ట్స్ ని అమ్మకానికి పెట్టుకోవచ్చు. సినిమాల్లోనూ, బిజినెస్ లోనూ కాజల్ దూసుకుపోతున్నట్లే.

Leave a comment