సరదాకు, ఫ్యాషన్ కారణంగా కుడా ఎంతో మంది ఫంకీ జ్యువెలరీ, మెటల్ ఆభరణాలు, గిల్ట్ నగలు ధరిస్తుంటారు. వీటి వల్ల అలర్జీలు రావడం చాలా సహజం. గిల్ట్ నగల్లో నికిల్, క్రోమియం మూలకాలు వుంటాయి. ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. చర్మంరంగు మారిపోవడం చిన్ని పుండ్లు రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ నగల్ని ఎక్కువసేపు శరీరం పైన ఉంచకూడదు. చమట తో తడిస్తే తప్పని సరిగా ఎలర్జీ వస్తుంది కను, శరీరంపై చమట కనిపించగానే తీసేయాలి. నగలు పెట్టుకున్నప్పుడు ఫెర్ ఫ్యూమ్ వాడకుదు. నగలు ధరిచేతప్పుడు శారీర భాగాలు తప్పని సరిగా పొడిగా వుండాలి. నగల్ని తీసినప్పుడు వాటిని పొడి బట్టలో తుడిచి ఆరిపోయాక బద్రం చేయాలి.

Leave a comment