బంగారు నగలు కూడా అస్తమానం వాడితే మెరుపు తగ్గిపోతాయి. అవి ఎప్పుడు మెరుస్తూ ఉండాలంటే శుభ్రం చేయటంలో ,భద్రపరచటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్ ,మాయిశ్చరైజర్ వంటి లోషన్లు వంటికి రాసుకొన్నాక ,మెకప్ వేసుకొన్న తర్వాత నగలు ధరించాలి. లేకుంటే ఈ రసాయనాలు నగల మెరుపు పోగోడతాయి. నగలు ధరించాక వాటిని శుభ్రం చేసి బీరువాలో భద్రపరచాలి.చెమట,పౌడర్ వంటివి అంటుకొన్న నగల్ని అలాగే బీరువాలో పెడితే పాడవుతాయి.ఇంటి పనులు,వ్యాయమాలు వంటివి చేస్తుంటే చమటపడుతాయి అప్పుడు ఖరీదైన సెట్స్ ,నగలు ధరించకూడదు. ఇల్లు శుభ్రం చేసే ఉత్పత్తులకు నగలు దూరంగా ఉంచాలి. వేడి నీళ్ళలో ,మైల్డ్ డిటర్జెట్ కలిపి మొత్తని బ్రేష్ తో నగల్ని నెమ్మదిగా రుద్ది మురికి పోగొట్టాలి. తర్వాత మంచి నీటితో కడిగి పొడిగా తుడిస్తే నగల మెరుపు పోకుండా ఉంటుంది.

Leave a comment