పండగ వచ్చింది కదా. బంగారు నగలు మెరుపు ,మెరుగు పోయినట్లు కనిపిస్తే వాటిని తేలిగ్గా శుభ్రం చేయచ్చు. ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ కొంచం ఉప్పు కలిపినా గోరువెచ్చని నీళ్ళలో కాసేపు బంగారు నగలని నాననివ్వాలి. దీని వల్ల మెరుపు బావుంటుంది. వాషింగ్ పౌడర్ లో నగలు క్లీన్ చేయటం మంచిదే వైట్నేంగ్ పౌడర్లు ఆభరణాలను హాని చేస్తాయి . వేడినీటిలో అమ్మోనియా కలిపి బేబీ బ్రష్ తో వైప్ చేసి క్లీన్ చేయాలి నాన్ అబ్రాసిన్ టూత్ పేస్ట్ లేదా పౌడర్ ను మెత్తని కాటన్ పై కొద్దీ మొత్తంతో వేసి ఆభరణాలు రుద్దితే చాలు ఆతరువాత తడి టవల్ తో తుడిచేయాలి ఆభరణాలు శుభ్రం చేసేందుకు మొద్దుగా పదునుగా వుండే పరికరాలు వాడద్దు .

Leave a comment