సాదా రాళ్ళ నగలు, అన్ కట్ నగల విషయంలో కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే ఆ ఆభరణాలు మెరిసిపోతూ ఎప్పుడు కొత్తవిగా కనిపిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షాంపులు సబ్బుల లోని రసాయినాలు నగల పై, పైపూతలా అతుక్కుని వాటి మెరుపును తగ్గిస్తాయి. అంచేత స్నానానికి ముందు నగలు తీసి బద్రపరచాలి. మేకప్ వేసుకున్నాకే నగలు పెట్టుకోవాలి. హెయిర్ స్ప్రే, పర్ ఫ్యూమ్ లు, లోషన్లు  మొదలైన సౌందర్య సాధనాల్లోని రసానాలు నగల మెరుపును తగ్గిస్తాయి కనుక వీటిని వాడిన  ఐదు నిమిషాల తర్వాతే నగలు ధరించాలి. ఈత కొలనులో వుండే క్లోరిన్ కుడా నగలను పాడు చేస్తుంది. సాదా నగలు శుబ్రం చేసేందుకు గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. రాళ్ళ నగలు శుబ్రం చేయాలంటే చల్లని నీరే వాడాలి. నాగల్లోని మలినాలు టూత్ పిక్, బ్రష్ ను వుపయోగించి శుబ్రం చేయాలి. నగలు తేమగా వున్న చూట వుంచుకోకూడదు.

Leave a comment