పచ్చదనం అవసరం ప్రపంచం బాగానే గుర్తించింది. నగరాల్లో ఎత్తైన కట్టడాలు తప్ప పచ్చని చెట్లు లేవు. కాలుష్యంతో వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా లండన్ లో సిటీ ట్రీ పేరుతో చెంచ్ ల ఏర్పాటు చెస్తున్నారు. నాలుగుమీటర్ల ఎత్తున పెట్టెలా ఉండే ఈ వాల్ పైన నాచు మొక్క లు పెట్టారు. ఇవి చెట్లతో సమానంగా గాలిని శుభ్రం చేస్తాయి. వర్షం పడ్డప్పుడు నీరు నిలువచేసుకొని ఈ నాచు మొక్కలని కాపాడే టెక్నాలజీ ఈ గోడల్లో ఇముడ్చారు. లండన్ వీధుల్లో సిటీ ట్రీ బెంచులు చల్లగా మంచి గాలి ఇస్తూ కనువిందు చేస్తున్నాయి. ఒక్క బెంచి 275 చెట్లకు సమానం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment