పదివేల శేషుల పడగల మయమూ..
ఈ రోజు నాగులచవితి కదా!! దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పండుగ.ఎంతో నిష్ఠగా,భక్తిగా చేసుకోవాలి మనం.
కృష్ణ జిల్లా మోపిదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి,అందరికీ తెలిసిన విషయమే.ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం. కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేస్తున్న సమయంలో అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు.
నాగులచవితి నాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి సంతానం కోసం,కోరికలు తీర్చే స్వరూపుడు అని పూజించి అనుగ్రహం కలగడం విశేషం.ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా సంతానం లేని వారికి సంవత్సరం తిరగకుండానే సంతానం కలుగుతుంది.
సఖులూ!! మరి అందరూ త్వరగా పనులు ముగించుకుని పుట్టలో ఆవు పాలు పోసి, పుట్ట మన్ను తెచ్చి అందరినీ చల్లగా చూడాలని దణ్ణం పెట్టుకొని వద్దాం పదండి!!
నిత్య ప్రసాదం: కొబ్బరి,తెల్లని పూలు,ఆవు పాలు,పానకం,వడపప్పు,పండ్లు.
-తోలేటి వెంకట శిరీష