అయిగిరి నందిని నందిత మేదిని

విశ్వ వినోదిని నందినుతే…

గిరివర వింధ్య శిరోధి నివాసిని
విష్ణు విలాసాని జిష్ణునుతే..
హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీదేవి అంశమైన దుర్గాదేవి మనకు నైనా దేవి రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. పురాణాల ప్రకారం దక్ష యఙ్ఞంలో పార్వతీదేవికి తనకు జరిగిన అవమానంతో అగ్నికి ఆహుతి అయ్యింది. సహించలేని శివయ్య ప్రళయతాండవంతో ఆమెను తీసుకుని వెళ్ళుతుండగా ఈ ప్రదేశంలో ఆమె కన్ను భాగం పడింది కావున నైనాదేవిగా కొలుస్తారు.
వసంత ఋతువులో ఎక్కువ మంది
భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారి సన్నిధిలో పూజలుచేసి ముక్తి పొందుతారు.
నిత్య ప్రసాదం:కొబ్బరి, పొంగలి,పులిహోర

-తోలేటి వెంకట శిరీష

Leave a comment