నాజూకుగా మారేందుకు మాత్రమే కాదు,ఆరోగ్యంగా ఉండేందుకే వ్యాయామం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం తో గుండె వేగం పెరిగి ఎక్కువ మొత్తం లో ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది దీని ద్వారా హార్మోన్ల ఉత్పత్తి పెరగటమే కాకుండా మెదడు కణాల అభివృద్ధి జరుగుతుంది. పనుల వత్తిడిలో నిద్ర సరిగా పోకపోతే అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపెడుతుంది. దీనికి వ్యాయామమే పరిష్కారం కనీసం అరగంట అయినా నడిస్తే మంచిది. బయట వాతావరణం అనుకూలంగా లేకపోతే మెట్లు ఎక్కి దిగడం, డాన్స్, ఈత టెన్నిస్ వంటివి ప్రాక్టీస్ చేయవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం మానకండి అంటారు ఎక్సపర్ట్స్.

Leave a comment