పట్టు కొంటే జారిపోయే సున్నితమైన మైసూర్ సిల్క్ చీరెలు దక్షిణాది మహిళలు ఎంతో ఇష్టపడతారు.పెళ్ళిళ్ళ కోసం కొనే చీరెల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ శారీ ఉండవలసిందే . 1912లో మైసూర్ మహరాజా కృష్ణరాజవడియార్ సిల్క్ దారాలను ఉత్పాత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఈ దారాలను ఐరోపా దేశాలకు పంపి అక్కడ మెషీన్ల మీద నేయించేవారు. నెమ్మదిగా స్విట్జార్లాండ్ నుంచి నేరుగా టామ్స్ ని ఇక్కడికే దిగుమతి చేసుకొనేవారు. స్వాతంత్ర్యం తర్వాత మైసూర్ స్టేట్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని సొంతం చేసుకుంది.1980లో కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చేతిలోకి వచ్చింది. కంచి పట్టును మించిన నాజుకుతనం ఈ మైసూర్ సిల్క్ లో కనిపిస్తుంది. పాత కాలపు సంప్రదాయ డిజైన్ లతో పాటు ఎంబ్రయడరీ డిజైన్లు ,బ్యూటీలు డబుల్ లైన్ చెక్స్ తో ఫ్యూర్ సిల్క్ రూపొందించారు.ఇవి ఖరీదు కూడా పెళ్ళిళ్ళకోసం రూపొందించే శారీలు లక్ష రూపాయాల కంటే ఎక్కువే. ఇప్పుడు సల్వార్ కమీజ్ లు కూడా ఈ సిల్క్ తో తయారు చేస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో అందాల పట్టుకే పెద్దపీట.

Leave a comment