వాతావరణం చల్లగా ఉంటే కొబ్బరి నూనె నేయి లాగా పేరుకు పోతే అది స్వచ్చమైనదిగా అనుకోవచ్చు. ఈ పేరుకోన్న కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ కూడా . దీన్ని రాసుకోవటం అంటే చర్మంపై రక్షణ పొరను ఏర్పాటు చేసుకొవటమే. పేరుకొన్న కొబ్బరి నూనెకు పెప్పరిమెంట్ నూనెను కలిపి లిప్ చామ్ గా వాడుకోవచ్చు. మొటిమలు తగ్గాలంటే రెండు చుక్కల టీట్రీ ఆయిల్ ,లావెండర్ నూనె ,కొబ్బరి నూనె కలిపి వాటిపై రాస్తే పోతాయి. మూడుతలు రాకుండా ఉండాలంటే గులాబీ నూనె కొబ్బరి నూనెతో కలిపి వాడాలి. చర్మం కింద ఉన్న కొవ్వు సరిచేయాలంటే ద్రాక్ష టాంజరెన్ ,ఆరెంజ్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి వాడాలి. చర్మం సాగిన గుర్తులు పోవాలంటే కొబ్బరి నూనెలో ఫల్శరాసా నూనె కలిపి వాడాలి. శరరీంపై కాలిన మచ్చలు పోవాలంటే లావెండర్ సచోలి జెరానియమ్ నూనపెలను కొబ్బరి నూనెతో కలిపి వాడాలి.

Leave a comment