రత్నాల్లో స్టార్ స్టోన్స్ చాలా అరుదుగా దొరుకుతాయి ముఖ్యంగా నక్షత్ర కెంపులు… గనుల్లో తవ్వేప్పుడు వంద కెంపులు దొరికితే అందులో రెండో మూడో నక్షత్ర కెంపులు అవుతాయి.  ఇంత అరుదైనవి అందరికీ దొరకాలికదా.  ఈ మధ్య కాలంలో సహజ జాతి రత్నాల్లోకి టైటానియం డయాక్సైడ్ చొప్పించి స్టార్ స్టోన్స్ తయారు చేస్తున్నారు.  సహజ నక్షత్ర కెంపులు కాకపోయినా  ఇవీ చక్కగానే ఉంటాయి.  ఈ కృత్రిమ రత్నాల నగలు పొదిగిన చెవి దిమ్మలు, బ్రాస్ లెట్స్,లాకెట్లు ఆన్ లైన్లో కనువిందు చేస్తున్నాయి.  కాంతి పడినప్పుడు నక్షత్రాకారపు వెలుగుని వెదజల్లడం, స్టార్ జెమ్స్ ప్రత్యేకత ఒక్క సారి విండో షాపింగ్ చేసేస్తే నచ్చినవి ఎంచుకోవచ్చు.

Leave a comment