Categories
విజ్ఞాన్ శ్రీ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా రికార్డ్ సృష్టించారు అన్నపూర్ణి సుబ్రమణ్యం.బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. నక్షత్ర మండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై ఆమె ఎప్పుడూ పరిశోధన చేస్తూనే ఉంటారు. ఆస్ట్రోశాట్ ఆదిత్య ఎల్ 1 ఇన్స్ట్రుమెంట్స్ లో అన్నపూర్ణి పాలుపంచుకున్నారు. కేరళలోని పాలక్కాడ్ లో చదువుకున్న అన్నపూర్ణి నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు అది ఆమె వృత్తి,జీవనాశక్తి జీవిక కూడా.