శృతిహాసన్ ఆలోచనలు ఎప్పుడు కొత్తగా సూటిగా ఉంటాయి . మాట్లాడే మాటలు చాలా పదునుగా దూసుకొస్తాయి.తన విషయం లో వ్యక్తిగత జీవితం ఎప్పుడు లేదంటుంది శృతి.మా అమ్మ నాన్న లు విడిపోయినప్పటి నుంచి మా అక్క చెల్లెలు పై మా ప్రతి కదలిక పై మీడియా కన్ను లేకుండా ఉందా? నేను ఆరోపణలు చేయడం లేదు కానీ వాస్తవం చెబుతున్న నన్ను పెళ్లి చేసుకోరా, లేదా పెళ్ళి తర్వాత నటించార అన్న ప్రశ్న ఎందుకు వేస్తుంది. అసలు పెళ్లి తరువాత మహిళలు జాబ్ మానేయడం ఎందుకు.న్యాయం గా మహిళల శక్తి యుక్తులను మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ విషయం లో చాలా తక్కువగా అర్థం చేసుకుంది.ఆడ వాళ్లు ఒకే సమయంలో ఎన్నో పనులు చేయగలరు అందుకు ఉదాహరణ నేనే అంటోంది శృతి .నిజమే కదా మనుషులకు ప్రైవసీ లేకపోవడం చాలా దురదృష్టం.మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి అనడం ,ఉండటం సెలెబ్రెటీలకు సాధ్యమా?!

Leave a comment