అన్న మంటే తెల్లగా మల్లెపూవులా సన్నగా పొడుగ్గా పొడి పొడిగా ఉండాలి. కానీ నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇదేదీ లేదు. అస్సాంలోని గోల్ పర్ రాష్టంలో రైతులు ఈ నల్ల బియ్యం సాగు మొదలు పెట్టి అధిక దిగుబడి సాధించారు ఈ నల్ల బియ్యం వరి సాగుకు చీడ పిడాలుండవు, కేవలం వంద రోజుల్లో పంట దిగు బడి చేతికి వస్తుంది అమెరికాలోని లూసియాన్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం ఈ నల్ల బియ్యం విటమిన్ ఇ ఎక్కువ నియాసిన్,కాల్షియం మెగ్నీషియం ఇనుము జింక్ వంటి ఖనిజ విలువలు ఉంటాయి పీచు పుష్కలం. బ్లాక్ రైస్ ఆందో సైనిక్స్ యాంటి ఆక్సడెంట్స్ గా,పని చేయటమే కాకా రోగ నిరోధక ఎంజైములనూ క్రియాశీలం చేస్తాయి. కప్పు బ్లాక్ రైస్ లో రెండు మూడు గ్రాముల ఫైబర్ వుంటుంది డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీరంలో వుండే ఇన్సులిన్ లెవెల్స్ ఈ బియ్యం తాగించడం వల్ల ఒబెసిటీ సమస్య కూడా తగ్గినట్లే . బ్లాక్ రైస్ లో ఆందోనియనిన్స్ ఉంటాయి ఇవి,కంటి వ్యాధులను నయం చేస్తాయి ఈ బియ్యంలో ఉండే ఆందోనియనిన్స్ మహిళలలో అధికంగా కనిపిస్తున్నా కాన్సర్ నిరోధకానికి తోడ్పడతాయని కాన్సర్ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బియ్యం గంజిని తలకు పట్టించి స్నానం చేస్తే వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి గంజిని ముఖానికి మాస్క్ గా రోజు వేసుకొంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
Categories