దక్షిణాది తో  పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటోంది. మనం చేసే పనుల్లో మార్పు కనిపించాలి నిన్న కంటే ఈ రోజు ఇవాళ్టి కంటే రేపు కొత్తదనం చూపించాలి ఇది సినిమాల ముచ్చట. వ్యక్తిగత జీవితం నేను మార్పు కోరుకొను. డబ్బు పేరు విజయం  నన్ను మార్చలేవు. కేవలం నేను శృతి హాసన్ నే . నన్ను ఏవీ ప్రభవితం చేయవు. అంటోంది శృతి. కెరీర్ ఆరంభంలో పోలిస్తే ఏమైనా మార్పు లొచ్చాయా అన్న ప్రశ్నకు శ్రుతీ ఏవీ లేదండి. నేనంటే నేనొక్కదాన్నే కాదు. నాలో ఇద్దరున్నారు. ఒకరు కధానాయిక శృతి హాసన్ నేను చేసే శ్రమ గుర్తింపు ఆదరణ అన్నీ సెట్ లోంచి నేను ఇంటికెళ్ళేదాకే. ఇంటికెళితే ఇంకో శృతి . బయట విషయాలతో సంభంధం లేని శృతి. బయట కూడా ఇంట్లో  గురించి మాట్లాడాను. చిన్నపటినుంచి సిఎంమా వాతావరణం లో  పెరగటం వల్ల  వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని నేరుగా వంచుకోవటం అలవాటైంది. ఈ రెండిటినీ వేరు వేరుగానే చూస్తానంటోంది  శృతి హాసన్. ఇంటికి వెళుతూ ఆఫీస్ లో బర్డెన్నంత ఇంట్లో వాళ్ళ పైన మోపే ఎంతో మందికి శృతి హాసన్ ఆదర్శం కావాలి.

Leave a comment