మోచేతులు నల్లగా బరకగా అనిపిస్తాయి.ఆ నలుపు దనం పోయి మృదువుగా అయిపోవాలంటే వేడి చేసిన కొబ్బరి నూనె కి బ్రౌన్ షుగర్ రెండు చుక్కల తేనె కలిపి ఆ ప్రాంతంలో రుద్దాలి.వీటిలో ని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి తేమ అందేలా చేస్తాయి.బంగాళదుంప పలుచగా కోసి ఆ ముక్కల్ని చేతులపై రుద్దాలి.లేదా బంగాళాదుంప రసంలో తేనె కలిపి రుద్దితే త్వరగా పరిష్కారం లభిస్తుంది.కలబంద గుజ్జు కొద్దిగా పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.వంట సోడా లో పాలు కలిపి పూతలా వేసి ఆరాక కడిగేస్తే మోచేతులు నలుపు తగ్గుతాయి.

Leave a comment