నోట్లోనికి గాలి పీల్చుకొని బుగ్గలను ఉబ్బిస్తే మొహాం పైన ముడతలు కనబడకుండా పోతాయట. ఈ వ్యాయమం రోజులో చాలా సార్లు చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు వెచ్చని కొబ్బరి నూనెతో చెంపలను మర్ధన చేస్తే చెక్కిళ్ళు చాలా మృదువుగా అయిపోతాయి. అలాగే చర్మం కమిలినట్లు అనిపిస్తే పులిసిన పెరుగును రాయండి. మరకలు నలుపు మాయమైపోతాయి అంటున్నారు .అలాగే బచ్చల ఆకులు గులాబీ రేకలు పేస్ట్ గా చేసి ముఖంపై రాసి ఆరిపోయాక కడిగేస్తే మొటిమలు ,పోక్కులు ,గిల్లటం వల్ల కలిగిన మచ్చలు పోతాయి.

Leave a comment