ఒక్కోసారి మనకిష్టమైనవే మంచివని రిపోర్టు వస్తుంది. ఇది చూడండి వాకింగ్ చేస్తు బబుల్ గమ్ నములుతూ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు అంటున్నారు టోక్యోలోని వాసెడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్ గమ్ తింటే గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. నడిచే వేగం దూరం పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్త్రీ, పురుషుల భేదం లేకుండా కొన్ని వేల మంది పై ఈ రిసెర్చ్ నిర్వహించారు. ఇది మధ్య వయసు వారి పై ఎక్కువ ప్రభావం చూపించింది. ఆరోగ్యం కోసం వ్యయామం చేసే వారికి మరింత ఎక్కువ ఫలితం సాధించేందుకు ఈ బబుల్ గమ్ నమలటం ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

Leave a comment