ఆల్మండ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమెగా, ఒమెగా 6, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షీయం, మెగ్నీషియం, జింక్ లు సహజంగానే శరీరానికి మేలు చేస్తాయి. బాదం నూనె శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతకాదు. బాదం పప్పులు శరీరానికి వేడిని, శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియకు సాయం చేస్తాయి. పోషకాహారనిపుణులు వేసవిలో బాదం పప్పును నానబెట్టి తినమంటున్నారు. అవి తెలిగ్గా జీర్ణం అవుతాయి. పై పొట్టు తీయకుండా నానిన బాదం పప్పు తింటే అందులో విటమిన్ ఇ శరీరానికి లభిస్తుంది.

Leave a comment