అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల  అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. గ్రిల్ల్డ్ మీట్ లో హెటేరో సైక్లిక్ ఎమెన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది. అయితే మాంసాన్ని రోజ్ మేరీ  వెల్లుల్లి వంటి ఇతర హెర్బ్స్ స్పైస్ లతో కొద్దిసేపు నానబెట్టి గ్రిల్ చేస్తే కార్సిజెనిక్ ప్రభావం 87 శాతం తగ్గిపోయిందని శాస్త్ర వేత్తల రిపోర్ట్. ఆహారం లోని కార్సినోజెన్స్ అనేక రకాల కాన్సర్ లకు దారితీసే అవకాశాలున్నాయట. ఆవటుగానో రుచిగా వుంటుందనో ఈ నానబెట్టే ప్రక్రియ మొత్తానికి ప్రయోజనకారమే నాని తేలింది.

 

Leave a comment