Categories
WoW

నాన్న అంత స్పీడ్ తో వెళ్ళకు నాకు భయం

ప్రతి నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ రోడ్డు ప్రమాద నివారణకు డ్రైవ్ సేఫ్ డాడ్ ప్రచారం చేపట్టింది. ఇందుకోసం ముంబైలోని ఎన్నో పాఠశాలలకు వెళ్లి పిల్లలను కలిసి వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళడం ఎంత ప్రమాదమో చెప్పారు. ఆ తర్వాత ఆ పిల్లల గొంతుతో “ నాన్నా నాకు భయమేస్తోంది నాన్నా వేగం తగ్గించండి” లాంటి మాటల రికార్డు చేశారు. చిన్న పిల్లల బొమ్మలు చేయించి రికార్డు చేసిన మాటలు ఆ బొమ్మలకు అనుసంధానం చేశారు. ఆ బొమ్మల్ని కారులో పెట్టుకోమని పిల్లలకు బహుమతిగా ఇచ్చారు. ప్రత్యేక సాంకేతికతతో పనిచేసే ఈ బొమ్మలు కారు వేగం ఎక్కువయ్యినప్పుడల్లా నాన్నా స్పీడ్ గా వెళ్తే నాకు భయం నాన్నా మెల్లగా డ్రైవ్ చేయి అని చెపుతాయి. అచ్చం పిల్లల్లాగే ఉన్న బొమ్మలు, పిల్లల గొంతుతో జాగ్రత్త నాన్నా అని చెపుతుంటే ఆటోమేటిక్ గా వేగం తగ్గిస్తున్నారట. ఈ ప్రచారం దేశమంతటా  విస్తరిస్తారని కబురు. రోడ్డు ప్రమాదాలు ఇలాగైనా తగ్గితే బావుండు.

Leave a comment