సంప్రదాయ ఆభరణాలు ఎప్పుడు బావుంటాయి. గతంలో బంగారు నాణాల నగలుండేవి. అవే కాసుల పేర్ల ఆకారంలో ఉండే రకరకాల నగలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కాయిన్ జ్యూవెలరీ ట్రెండ్ లో ఉంది. డబ్బుని నగలుగా ధరించడం కూడ ఫ్యాషనే. నాణాల హారాలు బావుంటాయి కూడా. సంప్రదాయ కాయిన్ జ్యూలరీ సైట్ లో రెడ్ స్టోన్స్ టెంపుల్ కాయిన్ నెక్లెస్ చాలా బావుంటుంది. ముచ్చటైన బంగారు నాణాలు నెక్లెస్ తో పాటు స్టైల్ గా రెండు మూడు కాయిన్స్ కలిపిన స్టడ్స్ కూడ జతగా ఉన్నాయి. ఇలాంటి కాయిన్ నగలు స్ట్రీట్ మార్కెట్లో కూడా ఉంటాయి.ఇమిటేషన్ లేదా వెండి నాణేలను రంగుల ఫ్యాబ్రిక్ దారాల అల్లికలో దేశీయ,పాశ్చాత్య దుస్తుల మీదకు మంచి లుక్ ఇస్తాయి.

Leave a comment