Categories
అమ్మాయిలు సాధరణంగా అతి మాములుగా ఉంటారు. సింపుల్ గా నగలు లేకుండా క్యాజువల్స్ తో ఆఫీస్ లో కాలేజీల్లో కనిపిస్తారు. ఉన్నట్లుండి ఏ పండగకో పెళ్ళి పిలుపుకో వస్తే లుక్ మార్చేస్తారు. ఇదిగో అలాంటి సమయాల్లో గ్రాండ్ గా కనిపించాలంటే జడావ్ జ్యూలరీ ఎంచుకోమంటారు ఎక్స్ పర్ట్స్. ఫ్లాట్ కట్ ,టేబుల్ కట్ డైమండ్స్ ఫాయిల్స్ సహయంతో బంగారంలో పొదిగి ఈ అద్భుతమైన నగలు తయారు చేస్తారు. ఇవి పెళ్ళి కూతురి నగలు కూడా 20,22 క్యారెట్ల బంగారంతో సహజసిద్దమైన ఖరీదైన కెంపులు,నీలాలు ఇతర జాతి రాళ్ళు వాడి అరుదైన సగిషీలతో రూపొందించే ఈ నగలు ఖరీదైనవి.