ఓ బొజ్జ గణపయ్య….బుజ్జి గణపయ్య!! బుడి బుడి అడుగుల బుజ్జాయి…పార్వతి తనయా రావోయి!!

గణాలకు అధిపతి అయిన నర్తన గణపతికి  తొలి పూజ.కళాకారులు తమ ఆంగికము,వాచికముతో ముందు ఆహ్వానిస్తారు.ఈ గణపయ్యకు నర్తించటం,నర్తిస్తు తనను ఆరాధించే భక్తులంటే ఎంతో ఇష్టం.
చందమామను పోలినవాడు,వెన్నెలలా స్వచ్ఛమైన నవ్వు,సిధ్ధి-బుద్ధుల వర ప్రదాతుడు.మనం కోరికలను మనస్పర్తిగా కోరితే రెట్టింపు వరాలను ప్రసాదిస్తాడు.నర్తన గణపతి అలంకార ప్రియుడు.మూషిక వాహనుడికి నిత్య ప్రార్థన ప్రధానం.సంగీతం, నృత్యం అంటే ఎంతో ఇష్టం.
ఇష్టమైన రోజు: బుధవారం
ఇష్టమైన పూలు: తెల్ల నిత్య మల్లె,గన్నేరు,నంది- గరుడ వర్ధనం,గరిక. తులసి అనివార్యం. నిత్య ప్రసాదం: కొబ్బరి, పానకం,వడపప్పు, ఉండ్రాళ్ళు.
తయారీ విధానం:ముందు రోజు బియ్యం కడిగి నీడలో ఆరబెట్టి,రవ్వ చేసుకుని…15 నిమిషాలు పచ్చిశనగ పప్పుని నానబెట్టాలి. 1రవ్వ: 1నీటి కొలతలలో ఉడికించి….గట్టి పడ్డాక శనగ పప్పు కలిపి ఉండలుగా చేసుకుని నర్తన గణపతికి సమర్పించిన ఆనందంగా స్వికరిస్తాడు.
ఆనంద నర్తన గణపతి భావయే…
      -తోలేటి వెంకట శిరీష

Leave a comment