చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా  ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే  జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని  బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా  రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే ఎక్కువ బాధ్యత అప్పగిస్తారు వైద్యులు. వాళ్ళతో ప్రేమగా ఉండాలని మందులు జాగ్రత్తగా ఇవ్వాలని వాళ్ళతో వారించవద్దనీ ఓర్పు సహనంతో ఉండమనీ  భార్యకు చెపుతారు . ఇది వారికీ మానసికంగా తీవ్ర వత్తిడికి గురిచేసి అనారోగ్యంకు బారిన ఖచ్చితంగా పడతారని రిపోర్ట్. ఒకవేళ అది డెమెన్షియా  నే అయితే ఆ జబ్బు అంటువ్యాధి కాకపోయినా భార్యకు వచ్చి తీరుతుందిట. జబ్బుతో వున్న వాళ్ళని భరించీ భరించీ  వాళ్ళు ఆ వ్యాధిన పడతారట. పెద్ద సర్వే చేయక పోయినా ఇది కరక్టే ననిపిస్తోంది. ఈ సేవ చేయటం శ్రద్ధ తీసుకోవటం ఆడవాళ్ళ పాలిట జీవితకాల శిక్షలాగా ఉంటుందనటంలో ఆశ్చర్యం ఏదీ లేదు.

Leave a comment