ఒక్క గ్లామర్ తోనే స్టార్స్ అయిపోతారని నేనెప్పుడు నమ్మను. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తేనే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అప్పుడే హీరోయిన్ అనిపించుకొంటే బావుంటుంది అంటుంది రాశి ఖన్నా. ఏ క్షణంలో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి అవకాశాల కోసం నేను ఆలోచించనే లేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభావతి పాత్ర నన్ను మంచి నటిగా పరిచయం చేసింది. దక్షినాది సినిమాల్లో హీరోయిన్ గా నాలుగు కాలాల పాటు నిలబడాలంటే గ్లామరే అని వినిపించేది. కానీ అవన్నీ వట్టి ఊహలు. నేను ఎక్స్ పిరియన్స్ చేసింది. చెప్తున్నా. నటనకు ప్రాధాన్యత ఉంటె ఇక్కడైన, ఎక్కడైనా నిలబడతాం. గ్లామర్ రోల్స్ చేయాలని అనుకొంటే నేను ఇప్పటికంటే రెట్టింపు సినిమాల్లో నటించేదాన్ని అంటోంది రాశిఖన్నా. వరుస అవకాశాలతో తారఫదంలో దూసుకుపోతున్న వాళ్ళలో రాశి ఖన్నా మొదటనే ఉంది.

Leave a comment