“నటరాజ నర్తించరా..సకల దేవతలు సంతశించగా..ప్రమథ గణంబులు పరవశించగ..”

నటరాజ రూపంలో దర్శనం ఇచ్చే శివునికి ఇష్టమైన నక్షత్రం “ఆరుద్ర”. శ్రీ కృష్ణ పరమాత్మ కూడా ఈ నక్షత్ర ప్రత్యేకతను బోధించారు. ధనుర్మాసంలో వచ్చే విశిష్టమైన ఆరుద్ర నక్షత్రంలో శివకేశవులను తప్పకుండా దర్శనం చేసుకోవాలి.మాఘ మాసంలో మరి మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి దైవధ్యానం చేసుకుని మోక్షం పొందడం.
నటరాజ స్వామివారికి సోమవారం,గురువారం ప్రీతికరమైన రోజులు.అర్చన, శివాష్టకం పఠనం చేయాలి.ముఖ్యంగా సంవత్సరానికి ఆరు సార్లు మాత్రమే నటరాజ స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు.మరి పదండి మనం కూడా దర్శనం చేసుకుని కటాక్షం పొందుదాం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పంచామృతాలు

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment