పెరుగు చర్మానికి సహజమైన క్లెన్సర్స్. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా చేయడమే కాక ముడతలు నిరోధిస్తుంది. డార్క్ స్పాట్ లకు సహజమైన చికిత్స కూడా. స్పూన్ సెనగపిండి స్పూన్ పెసరపిండి రెండు స్పూన్ల తేనె అర కప్పు పెరుగు తీసుకుని అన్నింటినీ కలిపి పేస్టులా చేసి నలుగు ముద్దలా చేసి ఒంటికి పట్టించుకుంటే దుమ్ము, ధూళికి మృతకణాలు పోతాయి మొహం పైన పెరుగు తో నెమ్మదిగా రుద్దితే నల్ల మచ్చలు క్రమంగా పోతాయి. పెరుగు పొడి చర్మానికి మాయిచ్చ రైజర్ గా ఉపయోగపడుతుంది పెరుగులోని లాస్టిక్ యాసిడ్ చర్మానికి మంచి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేయడం తో పాటు చర్మంలో మృతకణాలను తొలగించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

Leave a comment